ENG vs AUS | ఇంగ్లండ్ కు షాక్.. ఆసీస్ కు సూపర్ విన్ !

  • ఆస్ట్రేలియా రికార్డ్ చేజింగ్

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా నేడు జ‌రిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు రికార్డుల‌ను తిర‌గ రాసింది. ఇంగ్లండ్ జ‌ట్టు నిర్ధేశించిన 352 ప‌రుగుల‌ భారీ టార్గెట్ ను సైతం అల‌వోక‌గా 47.3 ఓవ‌ర్ల‌లో చేదించింది. తొలుత కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ జట్టు.. ఆ తర్వాత కోలుకుని అసాధ్యమని భావించిన ఛేజింగ్ ను సుసాధ్యం చేసి చూపించింది.

ట్రావిస్ హెడ్ (6), కెప్టెన స్టీవ్ స్మిత్ (5) విఫ‌లమైనా… మిగిలిన‌ బ్యాటర్లందరూ సమిష్టిగా రాణించి కొండంత‌ లక్ష్యాన్ని ఈజీగా చేధించారు. మార్నస్ లాబుషాగ్నే (47) రాణించ‌గా… మాథ్యూ షార్ట్ (63), అలెక్స్ కారీ (69) అర్థ శ‌త‌కాల‌తో హోరెత్తించారు. ఇక వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (120 నాటౌట్) సెంచ‌రీతో క‌దంతొక్కాడు. ఆక‌ర్లో గ్లెన్ మాక్స్‌వెల్ (32) ధనాధన్ బ్యాటింగ్ తో బౌండరీల మోత మోగించాడు.

కాగా, ఐదు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయినా.. ఆసీస్ జట్టు ఏమాత్రం తడబడకుండా అద్భుత ప్రదర్శన చేసింది. మాథ్యూ షార్ట్ – మార్నస్ లాబుస్‌చాగ్నే మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వారు అవుట్ అయిన తర్వాత, జోష్ ఇంగ్లిస్ – అలెక్స్ కారీ జట్టు బాధ్యతలను తీసుకున్నారు. జోష్ ఇంగ్లిస్ – అలెక్స్ కారీ క‌లిసి ఐదో వికెట్ కు 146 ప‌రుగుల భారీ సాధించారు.

దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో ఆసీస్ రికార్డులు !

ఛాంపియన్స్ ట్రోఫీలో ఫాస్టెస్ట్ సెంచ‌రీలు

  • 77 బంతులు – వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) vs ఇంగ్లాండ్, కొలంబో, 2002
  • 77 బంతులు – జోష్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా) vs ఇంగ్లాండ్, లాహోర్, ఈరోజు*
  • 80 బంతులు – శిఖర్ ధావన్ (భారత్) vs సౌతాఫ్రికా, కార్డిఫ్, 2013
  • 87 బంతులు – తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక) vs సౌత్ అరికా, సెంచూరియన్, 2009

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక విజయవంతమైన పరుగుల ఛేజింగ్:

  • లాహోర్‌లో ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్ 356/5, 2025 (టార్గెట్ 352) – ఈరోజు*
  • 2017 ఓవల్‌లో భారత్ vs శ్రీలంక ద్వారా 322/3 (టార్గెట్ 322)
  • ది ఓవల్, 2017లో బంగ్లాదేశ్ vs ఇంగ్లండ్ ద్వారా 308/2 (టార్గెట్ 306)

కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు దుబాయ్ వేదికగా భారత్ – పాకిస్థాన్ (గ్రూప్ ఏ) మ్యాచ్ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *