Shobhayatra | ‘ఫ్లెమింగో ఫెస్టివల్–2026’ షురూ..

Shobhayatra | ‘ఫ్లెమింగో ఫెస్టివల్–2026’ షురూ..
- ప్రత్యేక ఆకర్షణగా భారీ శోభాయాత్ర
Shobhayatra | సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా), ఆంధ్రప్రభ : సూళ్లూరుపేటలో ఈ రోజు ఉదయం ఫ్లెమింగో ఫెస్టివల్–2026 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సూళ్లూరుపేట ప్రవేశ ద్వారం హోలీ క్రాస్ సర్కిల్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్చ్ వరకు నిర్వహించిన భారీ శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ఊరేగింపును సూళ్లూరుపేట ఎమ్మెల్యే (MLA) నెలవల విజయశ్రీ, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. డప్పు కళాకారులు, సన్నాయి మేళాలు, కోలాటాలు, పంబలోళ్ళ ప్రదర్శనలు, విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. అర్జున–దుర్యోధన, ఆంజనేయ, నరసింహస్వామి, హరిదాసుల పాత్రధారులు, ఇతర కళారూపాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
శోభాయాత్రలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, మాజీ ఎంపీ (MP) నెలవల సుబ్రహ్మణ్యం, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, మునిసిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్, మునిసిపల్ కమిషనర్ చెన్నయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Shobhayatra | జోరుగా స్టాల్స్, క్రీడా పోటీలు
సూళ్లూరుపేటలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్–2026లో భాగంగా ప్రభుత్వ (GOVT) జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు శనివారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా గోపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఆర్డీఓ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం పశుసంవర్ధక శాఖ స్టాల్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ (Collector) డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ, మాజీ మంత్రి పరసారత్నం, ఆర్డీఓ కిరణ్మయి తదితరులు ఫ్లెమింగో ఫెస్టివల్–2026 బెలూన్‌ను ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్, ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరసారత్నం, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఆర్డీఓ కిరణ్మయి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ క్రీడా పోటీలను వారు ప్రారంభించారు. క్రీడాకారులను ఉత్సాహపరిచి, పోటీలను క్రీడాస్ఫూర్తితో నిర్వహించాలని సూచించారు.


