Shiva temple | పాత ఎడ్లంక శివాలయం దర్శనం…

Shiva temple | పాత ఎడ్లంక శివాలయం దర్శనం…
- మహా శివరాత్రి వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు
Shiva temple | అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక శివాలయంలో మహా శివరాత్రి వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. దేవాదాయ శాఖ ఈఓ యార్లగడ్డ శ్రీనివాసు (వాసు) ఆయనను ఘనంగా సత్కరించారు. దేవాలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి పరమేశ్వరుని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ అడపా శ్రీను ఆధ్వర్యంలో వేలాది భక్తులకు పులిహోర, మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా, మండలి వెంకట్రామ్ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను అడపా శ్రీను సత్కరించారు. కార్యక్రమంలో పీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, టీడీపీ కోడూరు మండల అధ్యక్షులు బండే శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పర్చూరి దుర్గాప్రసాద్, కొల్లూరి వాసు, మెగావత్ గోపీ తదితరులు పాల్గొన్నారు.



