కోనసీమలో 10 వేల మందికి ఆశ్రయం : మంత్రి అచ్చెంనాయుడు

ఆంధ్రప్రభ, అమలాపురం ప్రతినిధి : మొంథా తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తం గా 400 పునరావాస కేంద్రాలు నిర్వహించి 10,150 మందికి ఆశ్రయం కల్పించడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ సహకార ఉద్యాన మార్కెటింగ్ డైయిరీ డెవలప్మెంట్ మత్స్యశాఖ మంత్రి, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంచార్జ్ మంత్రి కే. అచ్చెన్న నాయుడు తెలిపారు.

బుధవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో మొంథా తుఫాన్ సహాయక చర్యలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈదురు గాలులు మూలంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 300 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, వాటి పునరుద్ధరణ పనులు 80 శాతం వరకు పూర్తి చేయడం జరిగిందన్నారు.

మిగిలిన 20 శాతం రానున్న రెండు గంటలలో పూర్తిచేసి ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరాను పూ ర్తిగా పునరుద్ధరిస్తామని మంత్రి అచ్చెన్న నాయుడు అన్నారు.

మొంథా తుఫాన్ మూలం గా ముందుగా ఊహించి నంతగా తీవ్రత లేకపోయి నప్పటికీ విద్యుత్తు సరఫరా రోడ్డు రవాణా రాకపోకలకు ఇబ్బందిని కలిగించిందని తెలిపారు. విద్యుత్ శాఖ ఎండి పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు రేయింబవళ్లు జరుగుతున్నాయన్నారు.

జిల్లావ్యాప్తంగా 54 సబ్ స్టేషన్ లపై మొంథా తుఫాన్ ప్రభావం పడిందని మొదటి ప్రాధాన్యతగా ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించడం జరిగింద న్నారు. ఆ దిశగా పునరు ద్ధరణకు చర్యలు వేగవం తం అయ్యాయన్నారు. రామచంద్రపురం రాజమహేంద్రవరం ముమ్మిడివరం తదిత ప్రాంతాల నుండి మానవ వనరులను తరలించి విద్యుత్ పునరుద్ధరణ జరుగుతుందన్నారు.

జిల్లావ్యాప్తంగా 134 కిలోమీటర్ల మేర రహదారులపై నేలకొరిగిన భారీ వృక్షాలను తొలగించి రహదారులపై రాకపోకలు పునరుద్ధరణ ఇప్పటికీ పూర్తయిందన్నారు. నేటి నుండి ఆర్టీసీ బస్సులు నూటికి నూరు శాతం రాకపోకలు సాగించనున్న ట్లు తెలిపారు. మంగళవారం పునరావాస కేంద్రాలలో ఉన్నవారిని బుధవారం తిరిగి స్వగృ హాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.3 వేల ఆర్థిక సహాయం అందించి పంపించాలని అధికారులకు ఇంచార్జ్ మంత్రి అచ్చెన్న నాయుడు ఆదేశించారు.

ఒంటరి సభ్యులకు రూ.1000చొప్పున, అదేవిధంగా గత ఐదు రోజులుగా సముద్రంపై వేటకు వెళ్లకుండా జీవ నోపాధి కోల్పోయిన మత్స్యకారులకు, చేనేత కార్మికులకు కుటుంబానికి 50 కిలోలు చొప్పున ఉచి తంగా బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించమన్నారు. మామిడికుదురు మండలంలో చనిపోయిన మహిళకు పోస్టుమార్టం అనంతరం నష్టపరిహారం ఐదు లక్షలు స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేయాల న్నారు.

ఈ కార్యక్రమంలో మొంథా తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేక అధికారి వి విజయరామరాజు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, స్థానిక ఎంపీ జి హరీష్ మాధుర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఎమ్మెల్యే లు అయితాబత్తుల ఆనందరావు, నిమ్మకాయల చిన్న రాజప్ప, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మెట్ల రమణబాబు, డిఆర్ఓ కే మాధవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply