bhogi| మాస్ మేనియాతో దుమ్మురేపిన ‘భోగి’..
మాస్ మేనియాతో దుమ్మురేపిన ‘భోగి’..
- నవంబర్ 12న థియేటర్లలో రక్తపాతం!
- ‘భోగి’ టీజర్‌తో అదరగొట్టిన శర్వానంద్
- రా అండ్ రగ్డ్ లుక్‌లో కొత్తగా కనిపించిన చార్మింగ్ స్టార్
- సంపత్ నంది మార్క్ మాస్ ఎలివేషన్స్..
- భీమ్స్ సిసిరోలియో బీజీఎం హైలైట్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇప్పటివరకు క్లాస్, చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో ఎక్కువగా కనిపించిన శర్వానంద్.. ఇప్పుడు పూర్తిగా మాస్ అవతార్‌లో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. శర్వానంద్ రా అండ్ రగ్డ్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎలివేషన్స్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
శర్వాలో సరికొత్త మాస్ యాంగిల్
‘భోగి’లో శర్వానంద్ కనిపిస్తున్న తీరు ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంది. రఫ్ లుక్, బ్లడ్ అండ్ రస్టిక్ వైబ్‌తో ఆయన పాత్రను డిజైన్ చేసినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఇప్పటివరకు చూసిన శర్వానంద్‌కు భిన్నమైన మాస్ షేడ్స్‌ను ఈ సినిమాలో చూడొచ్చనే ఆసక్తి కలుగుతోంది.
సంపత్ నంది మార్క్ ఎలివేషన్స్
మాస్ సినిమాలను తెరకెక్కించడంలో తనదైన శైలిని చూపించే దర్శకుడు సంపత్ నంది.. ‘భోగి’లోనూ అదే ఫార్ములాను ఫాలో అయినట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. యాక్షన్ సన్నివేశాలు, హీరో ఎలివేషన్స్, రా ట్రీట్‌మెంట్‌తో సినిమా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
బీజీఎం అదిరేలా..
సినిమాకు భీమ్స్ సిసిరోలియో అందిస్తున్న నేపథ్య సంగీతం టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలకు తగ్గట్టుగా పవర్‌ఫుల్ బీజీఎంతో మాస్ ఇంపాక్ట్‌ను మరింత పెంచారు. టీజర్‌లోని యాక్షన్, ఎలివేషన్ సీన్లకు బీజీఎం మంచి బలాన్ని ఇచ్చింది.
నవంబర్ 12న థియేటర్లలోకి..
శర్వానంద్–సంపత్ నంది కాంబినేషన్‌పై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ వాటిని మరింత పెంచింది. ఇప్పటివరకు శర్వానంద్‌ను చూసిన విధానానికి భిన్నంగా.. పూర్తిస్థాయి మాస్ పాత్రలో ఆయనను చూడబోతున్నామనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
‘భోగి’ చిత్రం నవంబర్ 12, 2026న థియేటర్లలో విడుదల కానుంది. మొత్తంగా టీజర్ చూస్తే.. మాస్ యాక్షన్ ప్రియులకు ‘భోగి’ మంచి ట్రీట్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.
వీడియో కోసం కింది లింక్ క్లిక్ చేయండి..
https://twitter.com/arunkalyan5/status/2106633511205732725/video/1
