వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు
గాయత్రీదేవి అలంకారంలో విద్యాసరస్వతీదేవి
వర్గల్, అక్టోబర్ 12(ఆంద్రప్రభ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో దర్శనం ఇవ్వనుండగా రెండవరోజైన సోమవారం శ్రీ విద్యాసరస్వతి అమ్మవారు సకల వేద స్వరూపిణి గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఆలయ పండితులు గణపతి పూజ మహాభిషేకంతో పాటు వేద విద్యార్థులచే శారదా సుప్రభాత పారాయణం భక్తుల గిరి ప్రదక్షణ చేశారు. భక్తుల అమ్మవారి జయజయ ద్వానాలతో శంభుగిరిలు మారుమోగాయి హైదరాబాద్ తదితర ప్రాంత భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోగా దేవాలయ కమిటీ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి అన్న ప్రసాదాన్ని అందజేశారు.
