Shah rukh Khan | బాలీవుడ్ కింగ్ కు షూటింగ్ లో గాయం ..

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ‘కింగ్’ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఓ యాక్షన్‌ సన్నివేశంలో డూప్‌ లేకుండా స్టంట్‌ చేస్తుండగా షారుక్ గాయపడ్డారని, దీంతో షూటింగ్ నిలిచిపోయిందని ఆ యూనిట్ వెల్ల‌డించింది. కాగా, ప్రాథమిక చికిత్స అనంత‌రం మెరుగైన వైద్యం కోసం షారుక్ తన బృందంతో కలిసి అమెరికా కు బ‌య‌లు దేరి వెళ్లారు… అయితే, ఏం జరిగిందనే విషయంపై పూర్తి వివరాలు తెలియరాలేదు. షారుక్ గాయానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, అది తీవ్రమైన గాయం కాదని, కండరాల గాయం అని షారుక్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. హీరో గాయపడడంతో ‘కింగ్‌’ షూటింగ్‌ ను సెప్టెంబర్‌ కు వాయిదా వేశారు

Read సినిమా న్యూస్

షారుక్, ఆయన కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రల్లో సిద్ధార్థ్‌ ఆనంద్‌ రూపొందిస్తున్న యాక్షన్‌ కథా చిత్రమే కింగ్.. ఇందులో సుహానాకు తల్లి పాత్రలో రాణీ ముఖర్జీ నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తుండగా షారుక్ ఖాన్ గాయపడ్డారని సమాచారం.