ప‌ని ఇప్పిస్తానని నమ్మించి.. మహిళపై లైంగిక దాడి

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌: ఇంటి ప‌ని ఇప్పిస్తానని నమ్మించి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

రాయదుర్గం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నమహిళకు ఓ యువకుడు ఇంటి పని ఇప్పిస్తానంటూ మ‌య‌మాట‌లు చెప్పి నమ్మించి ఆటో ఎక్కించుకున్నాడు. భర్తకు చెప్పి వస్తానన్నా వినకుండా ఆమెను ఆటోలో ఎక్కించుకొని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ – 51కు తీసుకెళ్లాడు. చెట్లు దట్టంగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను అమీర్‌పేట యూసీహెచ్‌కు తరలించి వైద్య ప‌రీక్షలు అందిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.