బాలుడిపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు!
మూడో తరగతి విద్యార్థిపై అఘాయిత్యం.. మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు
రూ.3 వేల జరిమానా.. బాధితుడికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశం
మేడ్చల్, ఆంధ్రప్రభ: బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి మేడ్చల్ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2019లో మూడో తరగతి చదువుతున్న బాలుడిపై జరిగిన లైంగిక దాడి కేసులో ఎటికెల రాజశేఖర్ అలియాస్ చన్నా (27) నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి కే. వెంకటేష్ గురువారం ఈ తీర్పు వెలువరించారు.
నిందితుడికి రూ.3 వేల జరిమానా విధించడంతో పాటు బాధిత బాలుడికి రూ.3 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు. ఖానాజిగూడ అంబేద్కర్ నగర్‌కు చెందిన రాజశేఖర్‌పై అల్వాల్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇన్‌స్పెక్టర్ పి. యాదగిరి మొదటి దర్యాప్తు అధికారిగా, ఏసీపీ ఏవీఆర్ నరసింహారావు రెండో దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. ప్రస్తుతం అల్వాల్ సీఐగా ఉన్న ప్రశాంత్ కూడా కేసు విచారణ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రెడ్డి న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.
