బీఆర్ఎస్‌లోకి పలువురు కాంగ్రెస్ నేతల చేరిక

తాడ్వాయి, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు దండుగుల మల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ ముడుపు నవీన్‌రెడ్డి, సీనియర్ నాయకుడు పిట్టల సురేష్ బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జి, మాజీ జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, బీఆర్ఎస్ నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. నూతనంగా చేరిన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.