Breaking news | గచ్చిబౌలిలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం..
Breaking news | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నగరంలోని గచ్చిబౌలి అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. 50 గజాల స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఈ భవనం పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడిపోయింది.
కొండాపూర్లో ఇవాళ మధ్యాహ్నం ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. అక్రమంగా నిర్మిస్తున్న ఈ భవనం కూలిపోవడంతో పక్కనే ఉన్న నిర్మాణాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో అగ్నిమాపక, పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్లో 50 గజాల స్థలంలో ఈ అక్రమ నిర్మాణం జరిగింది. కూలిన భవనం పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్పై పడటంతో అది కూడా దెబ్బతింది. సమీపంలోని హాస్టల్ వాసులు పరుగులు తీసినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
