2026-discounts | సెన్‌హైజర్ ఉత్పత్తులపై 60 శాతం వరకు డిస్కౌంట్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు
2026-discounts | హైదరాబాద్, ఆంధ్రప్రభ : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సందర్భంగా సెన్‌హైజర్ ప్రీమియం ఆడియో ఉత్పత్తులపై 60 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి ప్రారంభమైన ఈ విక్రయాల్లో మొమెంటం 4, ప్రొఫైల్ యూఎస్‌బీ మైక్రోఫోన్, మొమెంటం ట్రూ వైర్‌లెస్ 4, హెచ్‌డీ 490 ప్రో, హెచ్‌డీబీ 630, ఎంకేఈ 600 తదితర ఉత్పత్తులపై ప్రత్యేక ధరలు అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులకు ప్రత్యేక బ్యాంకు ఆఫర్లతో పాటు 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా లభిస్తుంది. మొమెంటం 4 రూ.34,990 గరిష్ఠ విక్రయ ధర నుంచి రూ.17,990కి, మొమెంటం ట్రూ వైర్‌లెస్ 4 రూ.29,990 నుంచి రూ.14,990కి లభించనున్నాయి. ప్రొఫైల్ యూఎస్‌బీ మైక్రోఫోన్ రూ.12,900 నుంచి రూ.6,990కి, ప్రొఫైల్ స్ట్రీమింగ్ సెట్ రూ.19,900 నుంచి రూ.11,990కి అందుబాటులో ఉంది.
హెచ్‌డీ 490 ప్రో రూ.40,000 నుంచి రూ.24,490కి, హెచ్‌డీ 490 ప్రో ప్లస్ రూ.45,000 నుంచి రూ.27,990కి లభించనున్నాయి. హెచ్‌డీబీ 630 రూ.36,490, ఎంకేఈ 600 రూ.31,900 నుంచి 31 శాతం తగ్గింపుతో రూ.21,990కి అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా సెన్‌హైజర్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆడియో ఆవిష్కరణల్లో తమ ప్రీమియం ఉత్పత్తులను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. అధిక నాణ్యత కలిగిన హెడ్‌ఫోన్‌లు, మైక్రోఫోన్‌లు, ఇన్-ఇయర్ మానిటర్లపై ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
