కాంగ్రెస్ నేతలకు సీతక్క అభినందనలు
తాడ్వాయి నాయకుల చొరవ, పార్టీ పట్ల నిబద్ధతపై మంత్రి ప్రశంసలు
తాడ్వాయి, ఆంధ్రప్రభ: ఓటు హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సంరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తాడ్వాయి మండల కాంగ్రెస్ నాయకులను మంత్రి సీతక్క అభినందించారు.
ఈ మేరకు మండల నాయకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. చలో ఢిల్లీ కార్యక్రమంలో నాయకులు చూపిన చొరవ, ఐక్యత, పార్టీ పట్ల నిబద్ధత అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బొల్లు దేవేందర్ ముదిరాజ్, మేడారం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అర్రెం లచ్చు పటేల్, పులి సంపత్, పాక సాంబయ్య, రేగా కళ్యాణి, కోడి సతీష్‌కుమార్, పాక రాజేందర్, అసడపు మాలయ్య, బుచ్చబోయిన రవికుమార్, మర్రి నరేష్, పలువురు మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
