School | విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్, మైక్ సెట్ పంపిణీ

School | విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్, మైక్ సెట్ పంపిణీ
- గ్రామ సర్పంచ్ మర్రి వంశీధర్ రెడ్డి
School | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని మసీదుగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యా కోసం అదనంగా నియమించిన విద్యా వాలంటీర్ కు తమ తల్లి మర్రి సరస్వతి దేవి జ్ఞాపకార్థం తన సొంత నిధులతో జీతంను అందజేస్తానని గ్రామ నూతన సర్పంచ్ మర్రి వంశీధర్ రెడ్డి తెలిపారు.
పాఠశాలలో ఈ రోజుఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాకిటి భూషణ్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు మహేందర్ రెడ్డి 26 వేల రూపాయల వ్యయంతో పాఠశాల విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రం విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్(Sports dress) తోపాటు, పాఠశాలకు మైక్ సెట్(mic set)ను సర్పంచ్ తో కలిసి విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా నూతన సర్పంచ్ వంశీధర్ రెడ్డి తో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని, పాఠశాల అభివృద్ధికి ఆర్దికంగా సహకారం అందజేసిన వారిని మండల విద్యాధికారి కలిసి ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వరూపారెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలో పెయింటింగ్ వర్క్(painting work)కు ఆర్థిక సహకారం అందజేసిన స్వర్గీయ మర్రి మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు, పాఠశాలకు వివిధ రూపాలలో ఆర్థిక సహకారం అందజేసిన గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తులందరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పల్సం జయమ్మ, పలువురు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలతో పాటు పాఠశాల ఉపాధ్యాయురాలు బి సుమతి, అంగన్వాడి టీచర్ మంజుల తదితరులు పాల్గొన్నారు.
