HYD | హెచ్‎సీఏలో స్కామ్.. ఉప్పల్ సీఐ సస్పెన్షన్..

హైదరాబాద్: ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి (Uppal CI Election Reddy) పై సస్పెన్షన్ వేటు పడింది. తనకు సంబంధం లేని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‎సీఏ) (HCA) వ్యవహారంలో తలదూర్చడంతో ఎలక్షన్ రెడ్డిపై వేటు వేశారు అధికారులు. కాగా, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‎లో భారీగా నిధుల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై హెచ్‎సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు (Jagan Mohan Rao) తో పాటు హెచ్‎సీఏ సెక్రటరీ దేవరాజ్ (Devaraj), ట్రెజరర్ జగన్నాథ్ శ్రీనివాస్ రావు (Jagannath Srinivas Rao), సీఈవో సునీల్ కుమార్ (Sunil Kumar), శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రెటరీ రాజేందర్ యాదవ్, రాజేందర్ యాదవ్ భార్య కవిత మొత్తం ఆరుగురిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఏ2గా ఉన్న దేవరాజ్‎ను తప్ప మిగిలిన అధికారులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దేవరాజ్ మాత్రం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. దేవరాజ్ పరార్ కావడానికి ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డే కారణమని అధికారులు గుర్తించారు. దేవరాజ్ అరెస్ట్‎కు సీఐడీ రంగం సిద్ధం చేయగా.. అరెస్ట్ సమాచారాన్ని ముందుగానే దేవరాజ్‎కు చేరవేశాడు ఎలక్షన్ రెడ్డి. దీంతో దేవరాజ్ సీఐడీకి చిక్కలేదు. సీఐడీ సమాచారాన్ని ముందుగా లీక్ చేసినందుకు సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు.

Leave a Reply