ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు తాడి భూషణం మృతి..

ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు తాడి భూషణం మృతి..

నివాళులు అర్పించిన ప్రముఖులు, ఉద్యోగ సంఘాల నేతలు


నర్సాపురం, ఆంధ్రప్రభ : సి ఐ టి యు నేత, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు తాడి నాగభూషణం (78) ఆదివారం రాత్రి మృతి చెందారు. పట్టణ 22వ వార్డు పాలపర్తి వారి పేటలో నివాసం ఉంటున్న ఆయన గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ విభాగంలో ఉద్యోగిగా పనిచేసి విశిష్ట సేవలు అందించారు.

ఆయన మృతికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పలు సామాజిక పోరాటాల్లో భూషణం చురుకైన పాత్ర పోషించారు. ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అభ్యుదయాలను ప్రోత్సహించి యువతకి ఆదర్శంగా నిలిచారు. నరసాపురం నడిబొడ్డున నిర్మించిన అంబేద్కర్ భవన నిర్మాణం, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ లో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.

సోమవారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే నాయకర్, శాసనమండలి మాజీ చైర్మన్ ఎం ఏ షరీఫ్, మాజీ మంత్రి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తపల్లి జానకీరామ్, ముదునూరి ప్రసాదరాజు, బండారు మాధవ నాయుడు, టిడిపి ఇంచార్జి పొత్తూరి రామరాజులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జె ఎన్ వి గోపాలన్, సీపీఐ నాయకులు నెక్కంటి సుబ్బారావు, ఆరేటి మృత్యుంజయ, సీపీఎం నాయకులు కవురు పెద్దిరాజు, ముచ్చర్ల త్రిమూర్తులు, పొగాకు పూర్ణ, పొగాకు నారాయణరావు , పట్టణ ప్రముఖులు, ఎస్సీ, ఎస్టీ సంఘాలు నాయకులతో పాటు పలు సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భూషణం మృతికి నివాళులు అర్పించి, కుటుంబానికి సానుభూతి తెలిపారు.