పాల్వంచలో పోలీసులను చూసి పరారు
భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : పాల్వంచలో ఈ రోజు ఉదయం కారు బ్యానెట్(Car bonnet) నుంచి పొగలు వచ్చాయి. కారు ఇంజన్‌లో పొగలు చెలరేగడంతో దగ్గరలో ఉన్న వాటర్ సర్వీస్ సెంటర్(water service center) యాజమాని వాటిని అదుపు చేయడానికి కారు బ్యానెట్‌ను ఓపెన్(open) చేశాడు.
అందులో గంజాయి ఉండడాన్ని గమనించి వెంటనే పోలీసుల(police)కు సమాచారం ఇచ్చాడు. దీంతో గంజాయి రవాణా చేసే వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయారు. కారులో ఉన్న గంజాయి కొంత మేర కాలిపోయింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంజన్‌లో దాచిన గంజాయిని, కారును స్వాధీనం చేసుకున్నారు.