వివాహితను రక్షించిన స్పెషల్ ఫోర్స్ పోలీసులు

వివాహితను రక్షించిన స్పెషల్ ఫోర్స్ పోలీసులు
బాసర, ఆంధ్ర ప్రభః గోదావరి నదిలో స్నానం ఆచరిస్తూ ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోతుండగా స్థానికులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న తెలంగాణ స్పెషల్ ఫోర్స్ పోలీసులు వివాహిత మహిళను రక్షించిన ఘటన బాసర పుణ్యక్షేత్రంలోని గోదావరి నది వద్ద చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా చిన్నాపూర్ తాండ గ్రామానికి చెందిన అరుణాదేవి బాసర గోదావరి నది మొదటి ఘాట్ వద్ద సాయంత్రం నదిలో స్నానమాచరిస్తు మునిగిపోతుండగా యాత్రికులు, స్థానికులు గమనించి కేకలు వేశారు. అక్కడే ఉన్న మహిళలు కట్టుకునే చీరలు వేసారు తెలంగాణ ఫోర్స్ పోలీసులు స్థానికుడు నదిలోకి వెళ్లి అరుణా దేవిని కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఆపద సమయంలో తక్షణం స్పందించిన పోలీసులను యాత్రికులు,స్థానికులు అభినందించారు.

