వారికి బాలయ్య శుభవార్త..

వారికి బాలయ్య శుభవార్త..
తన సొంత నిధుల ద్వారా కోటి రూపాయలతో ఇంటి స్థలాలు పంపిణీకి రంగం సిద్ధం
ప్రెస్ క్లబ్ కమిటీకి సంబంధం లేకుండా కొత్త కమిటీ ద్వారా పట్టాల పంపిణీ ఏర్పాటు..!
కొత్తగా ఏర్పడిన హౌస్ బిల్డింగ్స్ సొసైటీ
కొత్త కమిటీ ద్వారా వేగంగా .!జరుగుతున్న పనులు..!
హిందూపురం, ఆంధ్రప్రభ : సత్యసాయి జిల్లా (Sathya Sai District) హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య జర్నలిస్టులకు తీపి కబురు అందించారు. ఏకంగా కోటి రూపాయలు వెచ్చించి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే కొత్త కమిటీని ఏర్పాటు చేయించి ఆ కమిటీ ద్వారా జర్నలిస్టులందరికి త్వరలో పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రెస్ క్లబ్ కమిటీకి ఏమాత్రం సంబంధం లేకుండా జర్నలిస్ట్ కాలనీ అండ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కట్టాల పంపిణీ కార్యక్రమం త్వరలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులుగా బాలకృష్ణ (Balakrishna), అదేవిధంగా ఉపాధ్యక్షులుగా నంజప్ప కార్యదర్శిగా అంజన్ మూర్తి కోశాధికారిగా గంగిరెడ్డి, మెంబర్స్ శివకుమార్ చంద్రశేఖర్ రెడ్డి, రమేష్, గోపాల్, అలిపిర శ్రీనివాస్ రెడ్డి, గిరీష్ బాబు ఇలా కమిటీని ఏర్పాటు చేశారు. వీరి ద్వారా ఇక అన్ని లావాదేవీలు కూడా జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే బాలయ్య దాదాపు జర్నలిస్టులకు మంచి విలువైన స్థలంలో జర్నలిస్టులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నది ఆయన కోరికగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే బాలయ్య ఈ విషయాన్ని మాటల ద్వారా కాకుండా చేతుల ద్వారా చూపిస్తున్నారు. ఏకంగా 65మంది జర్నలిస్టులకు దాదాపు విలువైన స్థలాన్ని మూడు సెంట్లు దాదాపు 20 లక్షల విలువ చేసే స్థలాన్ని ఒక్కొక్క జర్నలిస్టుకు కూడా ఆయన కేటాయిస్తున్నారు.
దీంతో పాటు జర్నలిస్ట్ కాలనీకి ఎన్టీఆర్ కాలనీ(NTR Colony) గా నామకరణం చేస్తూ ఆయన చేతుల మీదుగా త్వరలో భూమిపూజ కార్యక్రమాన్ని కూడా చేసే విధంగా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోటి రూపాయలు పెట్టి జర్నలిస్టులకు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక ఎమ్మెల్యే బాలయ్య ముందుకు వచ్చి తన సొంత ఖర్చులతో హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేయించి ఇస్తుండడం పట్ల జర్నలిస్టులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలయ్య జర్నలిస్టులందరూ తన తోటి సహోదరులని తన గెలుపులో జర్నలిస్టులందరూ ఎంతో సహాయపడ్డారు. అన్న విషయాన్ని కూడా ఆయన గత ప్రెస్ క్లబ్ సమావేశంలో కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఒక హిందూపురానికి ఒక ప్రత్యేకత ఉన్న నేపథ్యంలో తన నియోజకవర్గంలో తన అన్నదమ్ములుగా ఉన్న జర్నలిస్టులు కూడా వారి కుటుంబాలతో సంతోషంగా ఉండాలన్న కారణంతో ఆయన విధంగా జర్నలిస్టులకు పట్టాల పంపిణీ ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానున్నారు.
ఇకపోతే ప్రెస్ క్లబ్ కమిటీకి ఏమాత్రం సంబంధం లేకుండా కొత్త కమిటీ (new committee) ద్వారా ఏర్పాటు చేసి ఇస్తున్నారు. కాబట్టి జర్నలిస్టులందరూ ఇక ప్రెస్ క్లబ్ కమిటీతో పనిలేకుండా ఏకంగా ఈ కొత్త కమిటీ ద్వారానే ఇంటి పట్టాల విషయంలో వారితో సంప్రదించవచ్చు అన్నట్లు తెలుస్తుంది. ఇక భవిష్యత్తులో కూడా ఈ కమిటీ ద్వారానే అన్ని పనులు కూడా జర్నలిస్టులకు జరిగే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఇప్పటికే 80% శాతం పనులు పూర్తయ్యాయని దీని కేవలం 20శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఇక పూర్తయి త్వరలో పట్టాల పంపిణీకి సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఏదేమైనా కొత్త కమిటీ ఏర్పాటుతో పనులు వేగవంతంగా ముందుకు వెళుతున్నాయి.
అధ్యక్షులు బాలు, అదేవిధంగా కార్యదర్శి అంజన మూర్తి (Anjana Murthy) ఆధ్వర్యంలో పట్టాలకు సంబంధించిన పనులు వేగవంతంగా ముందుకు పోతున్నాయి. ఏదేమైనా ఎన్నో ఏళ్ల నుండి దాదాపు 30ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు ఎమ్మెల్యే బాలయ్య తీపి కబురు అందించడంతో జర్నలిస్టుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఏదేమైనా కొత్త కమిటీ ఏర్పడడంతో జర్నలిస్టులందరూ ఆ జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు తెలుపుతున్నారు. ఏదేమైనా ఎమ్మెల్యే మాట తప్పడం కానీ, మడమ మార్చడం కానీ ఆయన డిక్షనరీలో లేదన్న విధంగా జర్నలిస్టులకు విలువైన స్థలాలను కేటాయించడంలో తన ప్రత్యేకతను హిందూపురంలో చాటుకుంటున్నారు.. దీంతో జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆయనకు అభినందనలు తెలుపుతున్నాయి.
