కోతుల నివారణకు సర్పంచ్ ప్రత్యేక దృష్టి..

కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్దూర్ జిపి పరిధిలో గల కడెం పెద్దూర్ లంబడి తండా కొలం గూడెం తదితర గ్రామాల్లో గత కొన్ని నెలల నుండి కోతులు విపరీతంగా పెరగడంతో పెద్దూర్ కడం జీపీ పరిధిలోని ప్రజలు రైతులు వృద్ధులు యువకులు పిల్లలు మహిళలు కోతుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని జీపీ ప్రజా ప్రతినిధులు, ప్రజలు, యువకులు, మహిళలు గతంలో కడం తహసిల్దార్ ఎంపీడీవో ఎఫ్ఆర్ఓ పంచాయతీ కార్యదర్శులకు కోతులను నివారించాలని వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఫలితం లేకపోయింది.

పెద్దూరు జిపి పరిధిలో గల కోతులను నియంత్రించే చర్యలు తీసుకోవాలని పెద్దూర్ జిపి పరిధిలోగల ఉప సర్పంచ్ పిట్టల రాజన్న జిపి పాలకవర్గం సభ్యులు ప్రజలు యువకులు నాయకులు మహిళలు ఇటీవల నూతనంగా గెలిచిన పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై స్పందించిన గ్రామ సర్పంచి దీకొండ విజయకుమార్ కోతులు పట్టే వాళ్ళతో మాట్లాడి తమ జిపి కి వచ్చి తమ జిపి పరిధిలోని కోతులను పట్టి దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని కోరారు. అయిదు రోజుల తర్వాత జిపి కి వచ్చి జిపి పరిధిలోని కోతులను పడతామని కోతులు పట్టేవాళ్ళు చెప్పడం జరిగింది.

రాబోయే కొద్ది రోజుల్లో పెద్దూర్ జిపి పరిధిలో ఉన్న కోతులను పట్టించి పట్టిన కోతులను దూరంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి జిపి పరిధిలో కోతుల బెడద లేకుంటే చూస్తామని పెద్దూరు కడం గ్రామ సర్పంచ్ దీకొండ విజయకుమార్ పేర్కొన్నారు. పెద్దూర్ జిపి సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ జిపి పరిధిలో కోతుల బెడద లేకుండా తీసుకున్న చర్యలపై జిపి పరిధిలో గల ప్రజలు యువకులు నాయకులు మహిళలు రైతులు వృద్ధులు అధికారులు ఉద్యోగులు వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ దీకొండ విజయకుమార్ ఉప సర్పంచ్ పిట్టల రాజన్న జి పి పాలకవర్గం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు

Leave a Reply