జాతీయ ఏక్తా దివస్ వేడుకల్లో సర్పంచ్ సుందరయ్య యాదవ్
గుజరాత్ వేడుకల్లో పాల్గొని వచ్చిన సర్పంచ్‌కు కలెక్టర్, ఎస్పీ అభినందనలు
ప్రశంసా పత్రం అందజేసి సత్కారం
చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ ఇటీవల గుజరాత్‌లో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్–2026 వేడుకల్లో పాల్గొన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చిన ఆయనను గురువారం జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రశంసా పత్రం అందజేసి సత్కరించారు. జాతీయ సమైక్యత, సమగ్రత సందేశాన్ని చాటిచెప్పే కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణమని సుందరయ్య యాదవ్ తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
