సర్పంచి సహా మరొకరు దుర్మరణం
- ఇద్దరినీ పొట్టన పెట్టుకున్న లారీ
కంచిలి ( శ్రీకాకుళం జిల్లా), (ఆంధ్రప్రభ) : విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్లున్న ఇద్దరు వ్యక్తుల పైకి లారీ (Lorry) దూసుకుపోగా.. అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన దుర్ఘటన ఇది. బుధవారం అర్ధరాత్రి విధులు నిర్వహించుకుని జలంధర కోట (Jalandhar Kota) గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ తండ్రి డోక్కరి దండాసి (65), మరో వ్యక్తి ఏం డి ఆయుబ్ (52) స్వగ్రామం జార్ఖండ్ రాష్ట్రం సతగాం కోదమ జిల్లా రహదారి పక్కన నిల్చొని ఉండగా పలాస వైపు వెళ్తున్న లారీ ఢీకొంది.
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న కంచిలి ఎస్సై పారినాయుడు ప్రమాద స్థలికి చేరుకొని లారీని అదుపులో తీసుకొన్నారు. మృతదేహాలను సోంపేట (Sompet) ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. జలంధర కోట సర్పంచ్ తండ్రి దండాసి మృతి చెందిన సమాచారంతో వెంటనే చుట్టుపక్క గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి ఆవరణం జన సంద్రాన్ని తలపించింది.