Sarpanch | పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శ్రీకారం

Sarpanch | చిట్యాల, ఆంధ్రప్రభ : తాను చదువుకున్న పెద్దకపర్తి ప్రభుత్వ పాఠశాల పై అభిమానంతో అభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశంను శుక్రవారం ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తాను విద్యను అభ్యసించిన పాఠశాలకు ఏదో చేయాలనే తపనతో సరస్వతి విగ్రహాన్ని గతంలో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రజలు తనను నమ్మి సర్పంచ్ గా గెలిపించినందుకు స్కోర్ ప్రహరీ గోడ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు కష్టపడి చదివి గ్రామానికి జిల్లాకు మంచి పేరు తేవాలని విద్యార్థులను కోరారు. పాఠశాలకు ఏ సహకారం కావాలన్నా తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ కోరారు సర్పంచును ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు అభినందించారు
