Sarpanch | అభివృద్ధికి బాట వేద్దాం..

Sarpanch | అచ్చంపేట, ఆంధ్రప్రభ : పోలిశెట్టి పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే.. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని పోలిశెట్టి పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆకారపు జ్యోత్స్న పరమేశ్వర్ అన్నారు. కాంగ్రెస్ ప్రజా పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ చేస్తున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్ల ఆకర్షితురాలినై విద్యాధికురాలినైన తాను కూడా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి అడుగు పెట్టానని, ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తు పై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.

గత బీఆర్ ఎస్ పది సంవత్సరాల పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఆరు గ్యారెంటీలతో ప్రజాపాలన సాగుతున్నదని అన్నారు. తాను సర్పంచిగా గెలిచిన వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారంతో.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిజమైన అర్హులైన అభ్యర్థులకు నిస్వార్ధంగా అందేలా చూస్తానని, గ్రామంలోని మౌలిక సదుపాయాలైన అంతర్గత రహదారులు, పంచాయతీ భవన నిర్మాణం, అండర్ డ్రైనేజ్, విద్య, వైద్యానికి కృషి చేస్తానని, అనునిత్యం గ్రామ అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని తెలిపారు. అధికార పార్టీకి ఓటేద్దాం, అభివృద్ధికి బాట వేద్దామని ఆమె పిలుపునిచ్చారు.

Leave a Reply