Sarpanch | అర్హుల‌కు ప్రభుత్వభూమి పంపిణీ చేస్తా..

Sarpanch | అర్హుల‌కు ప్రభుత్వభూమి పంపిణీ చేస్తా..

  • నర్సింగాపూర్ సర్పంచ్ అభ్యర్థి స్వర్గం భూమేష్

Sarpanch | ధర్మారం, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా నర్సింగాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి స్వర్గం భూమేష్ ఎన్నికల ప్రచారం వేగం రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ఉదయం నుంచి రాత్రి వ‌ర‌కు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. భూమేష్ మాజీ ఎంపీటీసీ బద్దం అజయ్‌పాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తల బృందంతో కలిసి గ్రామ ప్రజల సమక్షంలో అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల్ని పలకరించి తనను గెలిపిస్తే నర్సింగాపూర్ గ్రామ రెవెన్యూ శివారులోని మిగులు ప్రభుత్వ భూమిని మంత్రి లక్ష్మణ్ కుమార్ సాయంతో గ్రామ నిరుపేదలకు పంపిణీ చేయిస్తాన‌న్నారు.

గ్రామంలో చిన్న చెరువు నుంచి కాకుల బోరు వరకు ఎస్‌ఆర్ఎస్పీ కాలువ నిర్మాణం, ఓపెన్ జిమ్, సమ్మక్క గద్దెలు, శ్రీకృష్ణ గుడి వరకు రోడ్ నిర్మాణం, భక్తుల కోసం హల్లు, మాడెలయ్య గుడికి ప్ర‌హ‌రీ నిర్మాణం చేయిస్తాన‌న్నారు. అర్హులైన వారికి పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తా అన్నారు. ముదిరాజ్‌లకు మినీ ఫంక్షన్ హాల్ షెడ్డు, యాదవులకు గొర్రెల షెడ్డులు మంజూరు చేయిస్తాన‌న్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానన్నారు.

Leave a Reply