సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా పోలీసుల ప్రతిజ్ఞ
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ పి. శ్రీనివాసరావు పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు, స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశ సమైక్యతను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎన్. వెంకటరమణ, ఆర్ఐలు శంకర్ ప్రసాద్, నర్సింగరావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
