సంతోష్ సండే క్లిక్స్..
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ప్రకృతి అందాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. పచ్చని చెట్ల మధ్య రంగురంగుల రెక్కలతో సందడి చేసే పక్షులు ప్రకృతి వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. అలాంటి అరుదైన అందాన్ని తన కెమెరాలో బంధిస్తూ, గోల్డెన్ ఫ్రంటెడ్ లీఫ్‌బర్డ్ కదలికలు, ఆహారం వెతికే క్షణాలు, రెక్కలు విప్పి చేసే అందమైన విన్యాసాలను ఫొటోగ్రఫీ ద్వారా ఆవిష్కరించారు. పచ్చదనం మధ్య బంగారు వర్ణాలతో మెరిసిపోతున్న ఈ పక్షి దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. బీఆర్ఎస్ నేత సంతోష్ కుమార్ తన కెమెరాలో ఆదివారం బంధించిన క్లిక్స్ అబ్బుర పర్చుతున్నాయి.




