brs leader santhosh | అల‌రిస్తున్న సంతోష్ సండే క్లిక్స్‌

అల‌రిస్తున్న సంతోష్ సండే క్లిక్స్‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రకృతిని కెమెరాలో బంధించడం అంటే కేవలం ఓ అందమైన దృశ్యాన్ని చిత్రీకరించడం కాదు.. మన చుట్టూ ఉన్న జీవ వైవిధ్యాన్ని, అందులోని నిశ్శబ్దమైన అద్భుతాలను ప్రపంచానికి పరిచయం చేయడం. ముఖ్యంగా పక్షుల జీవనాన్ని వాటి సహజ ఆవాసాల్లో కెమెరాలో బంధిస్తే.. వాటి రంగులు, హావభావాలు, చురుకుదనం, ప్రశాంతమైన క్షణాలు ప్రతి ఫొటోలోనూ ప్రత్యేకంగా కనిపిస్తాయి. బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌ తీసిన పక్షుల ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రాలు.. పక్షుల అందాన్ని, ప్రకృతి వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.