రాహుల్ గాంధీ ఆత్మీయ పలకరింపు..

రాహుల్ గాంధీ ఆత్మీయ పలకరింపు..
“హాయ్ జగ్గా జీ.. హౌ ఆర్ యు”
షేక్ హ్యాండ్ ఇచ్చి జగ్గారెడ్డికి రాహుల్ గాంధీ ఆప్యాయ పలకరింపు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో ఆప్యాయతను చాటిన సంఘటన వికారాబాద్లో చోటుచేసుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆత్మీయంగా పలకరించారు. హాయ్ జగ్గా జీ.. హౌ ఆర్ యు అంటూ షేక్ హ్యాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా వికారాబాద్ లో జరిగిన కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుల సమావేశానికి ముందుగా కాంగ్రెస్ పీఏసీ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఆ సమావేశం ముగించుకుని రాహుల్ గాంధీ వెళ్తున్న సమయంలో ఆయన కారు వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్, అక్కడే ఉన్న జగ్గారెడ్డిని చూపిస్తూ “రాహుల్ జీ… జగ్గన్న ఈజ్ హియర్” అని సూచించారు. వెంటనే స్పందించిన రాహుల్ గాంధీ జగ్గారెడ్డి వైపు నడిచివెళ్లి, ఆయన చేతిని గట్టిగా పట్టుకుని “హాయ్ జగ్గా జీ.. హౌ ఆర్ యు” అంటూ పలకరించారు. ఈ ఆత్మీయ పలకరింపు కాంగ్రెస్ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
