సంగంబండ వరద

సంగంబండ వరద

ఒక గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల

మక్తల్, (ఆంధ్రప్రభ) :
భీమా ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన సంగంబండ రిజర్వాయర్‌కు వ‌ర‌ద వచ్చింది. ఎగువ కర్ణాటకలో కురిసిన వర్షాలకు రిజర్వాయర్ కు వరద వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం ప్రాజెక్టు అధికారులు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.మంగళవారం కర్ణాటకలో కురిసిన వర్షాల వల్ల పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది. వరద ఒక స్పిల్ వే గేటును ఎత్తి దిగువకు ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ ఎగువ ప్రాంతం కర్ణాటక లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పెద్ద వాగుకు వరద పోటెత్తింది. దీంతో రిజర్వాయర్ లోకి 500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో 500 క్యూసెక్కుల వరద నీటిని వదిలినట్లు ప్రాజెక్టు డీ ఈ ఈ సురేష్,ఏఈ రాహుల్ తెలిపారు .ప్రాజెక్టు సామర్థ్యం 3.317 టిఎంసిలు కాగా ప్రస్తుతం 2.78 టీఎంసీల నీరు రిజర్వాయర్ లో ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

Leave a Reply