Sammakka | వెదురు కర్రలను గద్దె పై ప్రతిష్టించిన గిరిజన భక్తులు

Sammakka | వెదురు కర్రలను గద్దె పై ప్రతిష్టించిన గిరిజన భక్తులు
Sammakka | మేడారం, ఆంధ్రప్రభ : ఆసియాలో అతి పెద్ద జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో నిన్న రాత్రి సారలమ్మ గద్దెకు చేరగా నేడు సమ్మక్క తల్లి చిలుకల గుట్ట నుండి గద్దెల వద్దకు చేరుకోనుంది. సమ్మక్క రాక సందర్భంగా ముందుగా వనం (వెదురు ర్రలను) గద్దె పై ప్రతిష్టించారు. జాతరలో వెదురుకు విశిష్ఠత ఉంది.
వనం అంటే ఆదివాసీ భాషలో అడవి అని అర్థం. ఈ వనం నుండి తల్లులు గద్దెల పైకి వస్తారు. కాబట్టి ముందుగా ఏపుగా ఎదిగిన వెదురు కర్రలకు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్క గడ్డెవద్దకు తీసుకు వచ్చి గద్దె పై ప్రతిష్టిస్తారు. వనం (వెదురు) తీసుకు వచ్చిన తరువాత చిలుకల గుట్ట నుండి సమ్మక్కను తీసుకువస్తారు.





