Safety Tips | అమ్మాయిలూ… ఒంటరిగా వెళ్తున్నారా?

Safety Tips | అమ్మాయిలూ… ఒంటరిగా వెళ్తున్నారా?

  • ఈ 10 పనులు మాత్రం అస్సలు చేయొద్దు..
  • మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది!

ఆంధ్ర‌ప్ర‌భ : అమ్మాయిలు ఒంటరిగా బయటకు వెళ్లడం సాధారణ. కాలేజీకి, ఆఫీసుకి, మార్కెట్‌కి, ఫ్రెండ్స్‌తో సినిమాకి… ఎక్కడికైనా స్వతంత్రంగా తిరుగుతున్నారు. ఈ స్వేచ్ఛతో పాటు అప్రమత్తత తప్పనిసరి. ఒక్కోసారి చిన్న పొరపాటు కూడా అతి పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. కాబట్టి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ 10 పనులు మాత్రం చేయకుండా జాగ్రత్త (Safety Tips) వహిస్తే మంచిదని సూచన.

  1. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పెద్ద సౌండ్ తో పాటలు వింటూ నడిస్తే, చుట్టూ ఏం జరుగుతోందో తెలియది. వెనక నుంచి వచ్చే బైక్, కారు హార్న్, ఎవరైనా వెనకాల పిలుస్తున్న సౌండ్… ఏమీ వినిపించదు. ఇది ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే.
  2. నడుస్తూ మొబైల్‌లో గేమ్స్ ఆడుతూ, రీల్స్ చూస్తూ నడవొద్దు.
    పరిసరాలపై స్పృహ లేకుండా స్క్రీన్‌కి అతుక్కుని ఉంటే చుట్టూ ఏం జరుగుతోందో గమనించలేరు. రోడ్డు మీద వాహనాలు, గొడవలు, అనుమానాస్పద వ్యక్తులు… ఏమీ కనిపించవు. ఇలా యథాలాపంగా మొబైల్ పట్టుకుని, పరధ్యాన్నగ్నా నడుస్తూంటే, దొంగలు కూడా సులువుగా మొబైల్ లాక్కెళ్ళే ప్రమాదముంది.
  3. చీకటి పడ్డాక ఒంటరిగా షార్ట్‌ కట్ రోడ్లు, ఒంటరి గల్లీలు వాడొద్దు.
    చీకటి పడ్డాక ఎక్కువగా వెలుతురు లేని రోడ్లు, ఎవరూ లేని గల్లీలు ప్రమాదకరం. వాటి బదులుగా జనసమ్మర్థం ఉండే బస్తీలోంచి, లైట్లు ఉన్న ప్రధాన రోడ్ల నుంచి నడవడం బెటర్. ఎంత ఆలస్యమైనా సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే ముఖ్యం.
  4. ఒకేచోట ఎక్కువ సేపు నిలబడి మొబైల్‌లో మాట్లాడొద్దు. ఎక్కణ్ణుంచి, ఎవరి కళ్ళు మిమ్మల్ని సునిశితంగా గమనిస్తున్నాయో మీకు తెలియకపోవచ్చు.
    ఒకే చోట నిలబడి గంటలు ఫోన్‌లో మాట్లాడితే దొంగలు, ఆకతాయిలు గమనించవచ్చు. వారికి మీరు సులువైన టార్గెట్ అయ్యే ప్రమాదముంటుంది. మాట్లాడాలంటే నడుస్తూనే మాట్లాడండి లేదా షాపులు ఉన్న చోట నిలబడండి.
  5. బస్టాండ్, రైల్వే స్టేషన్‌లో ఎవరో ఇచ్చిన నీళ్లు, టిఫిన్ అస్సలు తినొద్దు.
    అపరిచితులు ఇచ్చిన నీళ్లు, టిఫిన్, చాక్లెట్స్… ఏమీ తీసుకోవద్దు. మత్తు మందులు కలిపి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి దోపిడీ చేసే ఘటనలు ఎక్కువైపోయాయి.
  6. ఆటో, క్యాబ్ ఎక్కేముందు డ్రైవర్ గమనించేట్టు వెహికల్ నెంబర్ ఫోటో తీసి ఇంట్లో వాళ్లకు పంపొద్దు. డ్రైవర్‌కి తెలిసి జాగ్రత్తగా ఉంటాడు. లైవ్ లొకేషన్ షేర్ చేయండి.
  7. రాత్రి సమయంలో బ్లాక్ డ్రెస్, షార్ట్ డ్రెస్ వేసుకోవద్దు.
    రాత్రి సమయంలో ఆకర్షించే డ్రెస్‌లు కాకుండా, సాధారణ డ్రెస్, దుప్పట్టా, షాల్ వేసుకోవడం సురక్షితం.
  8. ఎవరైనా వెనకాల పదేపదే వస్తున్నట్టనిపిస్తే, గమనించి తప్పించుకోండి.
    నడిచే దిశ మార్చండి. షాపులోకి వెళ్లండి, ఎవరికైనా ఫోన్ చేయండి, గట్టిగా అరవండి.
  9. బ్యాగ్ ఒకే చేతిలో పట్టుకుని నడవొద్దు
    బైక్‌పై వచ్చి బ్యాగ్ లాక్కెళ్లే దొంగలు ఎక్కువైపోయారు. బ్యాగ్‌ని రెండు చేతులతో గట్టిగా పట్టుకోండి లేదా క్రాస్ బ్యాగ్ వాడండి.
  10. ఎప్పుడూ “నేను ఒంటరిని” అని చూపించొద్దు.
    నడుస్తున్నప్పుడు ధైర్యంగా, నమ్మకంగా నడవండి. భయపడి, గబగబా నడిచే వాళ్లను టార్గెట్ చేస్తారు. ఎవరైనా వేధిస్తే గట్టిగా అరవండి, సహాయం కోసం పిలవండి..
Safety Tips

ఈ టిప్స్ గుర్తుంచుకోండి..

ఎప్పుడూ పెప్పర్ స్ప్రే, సేఫ్టీ పిన్, అలారం కీచైన్ బ్యాగ్‌లో ఉంచుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఎవరికైనా చెప్పి వెళ్లండి. safe యాప్‌లు (T-SAFE, SHE టీం QR కోడ్ యాప్, భరోసా యాప్, సురక్ష SOS యాప్) డౌన్‌లోడ్ చేసుకోండి. రాత్రి 8 తర్వాత ఒంటరిగా వెళ్లాల్సి వస్తే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ (100) సేవ్ చేసుకోండి. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి ప్రమాదం దరిచేరదు.

Tourist attractions | ఓరుగల్లుకు పర్యాటక సొబుగులు..

Leave a Reply