SA-1 | నిరుపేద విద్యార్థులకు బ్లాంకెట్లు పంపిణీ….
SA-1 | దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు బిగ్ హెల్ప్(Big help) ఫర్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా 15 మంది నిరుపేద విద్యార్థులకు బ్లాంకెట్లు, స్టడీ మెటీరియల్ అందజేయడం జరిగింది.
ప్రతి తరగతిలో ఎస్ ఏ-1(SA-1) పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5 గురు విద్యార్థుల చొప్పున 25 మంది విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం రాజు, ప్రాజెక్టు డైరెక్టర్ ఎండి షర్ఫుద్దీన్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

