ఎస్‌ఏ-1 జవాబు పత్రాల బాహ్య మూల్యాంకనం ప్రారంభం
దండేపల్లి ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ప్రక్రియ
దండేపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (ఎస్‌ఏ-1) పరీక్షల జవాబు పత్రాల బాహ్య మూల్యాంకనం శనివారం దండేపల్లి ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది. విద్యార్థులు చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులతో కాకుండా ఇతర పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నారు. మూల్యాంకనంలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం ఉండేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండల విద్యాధికారి మంత్రి రాజు మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. నిబంధనల ప్రకారం జవాబు పత్రాల మూల్యాంకనాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.
కోర్సు ఇన్‌చార్జి సంఘర్ష రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. స్ట్రాంగ్ టీచర్ అప్పాల మనోహర్, సీఆర్‌పీ నర్సయ్య తదితరులు మూల్యాంకన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు బాహ్య మూల్యాంకనంలో పాల్గొన్నారు.
