రుద్రూర్‌కు ప్రభుత్వ సలహాదారు వరాల జల్లు

రుద్రూర్, ఆంధ్రప్రభ: రుద్రూర్ గ్రామ అభివృద్ధి కోసం రెండు కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం గ్రామంలో ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు రూ.78 కోట్ల నిధులు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.

గ్రామ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి త్వరలోనే అదనపు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సర్పంచ్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply