RTC Driver | చిట్యాల వాసికి ఎమ్మెల్యే సన్మానం…

RTC Driver | చిట్యాల వాసికి ఎమ్మెల్యే సన్మానం…
RTC Driver | తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : చిట్యాల గ్రామానికి చెందిన అంబీర్ నరేందర్ రావును సన్మానించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్(MLA Vivekananda Goud). అంబీర్ నరేందర్ రావు చిట్యాల గ్రామంలో పుట్టి, పెరిగి, వ్యవసాయం చేసిన వ్యక్తిగా తన ఊరుని గుర్తు చేసుకున్నారు. గ్రామంలో వ్యవసాయం స్థాయి నుండి ఆర్టీసీ డ్రైవర్(RTC Driver) వరకు ఎదిగిన జ్ఞాపకాలను ఆయన గుర్తు చేశారు.
తన ఊరు తనకు ఎంతో ఇచ్చిందని ఎంతో నేర్పించిందని, తల్లిదండ్రులు స్వర్గీయ అంబీర్ ఇందిరాబాయి శ్రీహరి రావు ఆశీస్సులతో, నాయకమ్మ దీవెనలతో ఉన్నత స్థాయిలో ఉన్నానని గుర్తు చేశారు. ప్రస్తుతం జీడిమెట్ల ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తూ, ఎల్ఐసి ఏజెంట్ స్థాయి నుండి అడ్వైజర్ వరకు ఎదగడం నాయకమ్మ ఆశీస్సులు అని గుర్తు చేశారు.
తన ఊరి కోసం ఎంతో కొంత తనవంతుగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా, శివాలయం వద్ద షెడ్డు నిర్మాణానికి ముఖ్యపాత్ర వహించడమే కాకుండా నాయకమ్మ వద్ద ప్రతి సంవత్సరం దుర్గామాత మాల భక్తులకు తన వంతు సహాయంగా ఇవ్వడం, వినాయక చవితి పండగకు విగ్రహ దాతలు(statue donors)గా ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం లో భాగంగా పిల్లలకు తనవంతుగా ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. తన ఊరు కోసం సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో సన్మానం అందుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
