అబ్దుల్లాపూర్‌మెట్‌ బాటసింగారం వద్ద ఘటన

రెండు కార్లు, ఆటో ధ్వంసం.. తప్పిన పెను ప్రమాదం
సీసీ కెమెరాల్లో రికార్డైన ప్రమాద దృశ్యాలు

అబ్దుల్లాపూర్‌మెట్‌: హైదరాబాద్‌ శివారులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న పెట్రోల్‌ బంకులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బంకు వద్ద ఉన్న రెండు కార్లు, ఓ ఆటో ధ్వంసమయ్యాయి.

బస్సు వేగంగా బంకులోకి దూసుకురావడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు బంకులోకి దూసుకెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.