అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే
మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి మండలంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పర్యటించారు. రూ.కోటి నిధులతో నూతన కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన మూడు సీసీ రోడ్లను ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. రూ.97 లక్షలతో నిర్మించిన మోపిదేవి – వెంకటాపురం తారు రోడ్డు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పలు అభివృద్ధి పనులకు విశేషంగా నిధులు సమకూర్చినట్లు ఎంపీ వివరించారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
