Rs.75.00 lakhs | పల్లెల అభివృద్ధే లక్ష్యం..

Rs.75.00 lakhs | పల్లెల అభివృద్ధే లక్ష్యం..
- ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
- అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Rs.75.00 lakhs | గూడూరు, ఆంధ్రప్రభ : పల్లెల అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పెడన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా గూడూరు మండలం లేళ్ళగరువు గ్రామంలో ఉపాధి పధకం రూ.75.00 లక్షల(Rs.75.00 lakhs) నిధులతో లేళ్ళగరువు గ్రామం నుంచి షాబ్ధుల్లపాలెం రోడ్డు వరకు తారు రోడ్డు నిర్మాణం మరియు ఆకులమన్నాడు గ్రామంలో 15వ ఆర్ధిక కమిషన్ రూ.36.00 లక్షల నిధులతో విలేజ్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు(infrastructure) బలోపేతం కావడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం, పారిశుధ్య అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

