ఇప్ప‌టికీ పెన్ష‌న్ అందేలా లేదు…

ఇప్ప‌టికీ పెన్ష‌న్ అందేలా లేదు…

కుంటాల, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని పెంచికల్ పాడు గ్రామానికి చెందిన పూర్రోళ్ళ రాధా అనే వికలాంగురాలు కాలు చేతులు పూర్తిగా పనిచేయవు అయితే గత నాలుగేళ్ల క్రితం తల్లి దేవి బాయ్ తో పాటు వికలాంగురాలు రాధా కలిసి జీవనం సాగించారు. అయితే గత నాలుగేళ్ల క్రితం తల్లి దేవ్ బాయ్ మృతి చెందింది. తల్లికి మాత్రం వికలాంగుల పెన్షన్ 4016 అందించారు. అధికారుల పొరపాటు మూలంగా బిడ్డకు బదులు తల్లి పేరును వికలాంగురాలుగా నమోదు చేశారు.

అయితే రాధతో పాటు ఆమె సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం రాధా వికలాంగురాలు పెన్షన్ లోని పేర్లు తారుమారు కావడంతో తల్లి దేవ్ భాయ్ మృతి చెందగా 4016 పెన్షన్ వచ్చింది. వెంటనే అధికారులకు పలుమార్లు వివ‌రించినా వికలాంగురాలు సమస్యను పట్టించుకోలేద‌న్నారు. దీంతో పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉన్న వికలాంగురాలు రాధకు వికలాంగుల పెన్షన్ ఇవ్వాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం మూలంగా గత నాలుగేళ్ల నుండి వికలాంగుల పెన్షన్ పొందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత వికలాంగురాలుకు తెలియని ఆఫీసు లేదు, తెలియని నాయకులు లేరు.

అయినప్పటికీ మండల ప్రజా పరిషత్ కార్యాలయం చుట్టూ సైతం పలుమార్లు కాలు అరిగే వరకు తిరిగినా ఫలితం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ సైతం విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఆమెకు నిరాశనే ఎదురైనందని ఆమె తెలిపారు. దీంతో ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు, మండల అధికారులు వికలాంగురాలికి న్యాయం చేసేలా నాలుగు వేల పెన్షన్ వచ్చేలా కృషి చేయాలని ఆమె అధికారుల‌ను వేడుకుంటున్నారు.

Leave a Reply