Rs.3 lakhs | ఎక్కడంటే…

Rs.3 lakhs | ఎక్కడంటే…

Rs.3 lakhs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఎస్ఐ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని సింహాద్రిపురం పోలీసు స్టేషన్‌లో ఏసీబీ అధికారులు (ACB officials) సోదాలు చేశారు. ఇందులో ఎస్సై అనిల్‌ కుమార్‌ (SI Anil Kumar) రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఒక కేసులో బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు సోదాలు చేపట్టారు. పులివెందుల రూరల్‌ సీఐ రమణ, సింహాద్రిపురం ఎస్సై అనిల్‌ కుమార్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

పక్కా వ్యూహం ప్రకారం సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న ఎస్సై అనిల్‌కుమార్‌ను రెడ్‌ హ్యాండెడ్‌ (Red-handed) గా పట్టుకున్నారు. లంచం సొమ్మును సీజ్ చేశారు. డీఎస్పీ, రూరల్‌ సీఐ ఆదేశాలతోనే బాధితుడు బ్రహ్మంను డబ్బులు డిమాండ్‌ చేసినట్లు అనిల్‌కుమార్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply