Rs-100-Crore-Funds-Kkonaseema ” ఇక రైలు సంద‌డి Andhra Prabha Exclusive Story

Rs-100-Crore-Funds-Kkonaseema ” ఇక రైలు సంద‌డి Andhra Prabha Exclusive Story

  • కోనసీమకు తీపి క‌బురు
  • దశాబ్దాల కల సాకారం దిశగా
  • కూట‌మి స‌ర్కారు చ‌క‌చ‌క‌
  • రూ.100 కోట్లు విడుద‌ల
  • కోటిపల్లి – నర్సాపూర్ రైల్వే లైన్ క్లియ‌ర్

( నరసాపురం , ఆంధ్ర ప్రభ).

కోనసీమలో రైలు కూత వినిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కోనసీమ ప్రజల
చిరకాల స్వప్నమైన కోటిపల్లి-నర్సాపూర్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి మోక్షం లభించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.100 కోట్ల నిధులను విడుదల చేస్తూ జీవో నంబర్ 575 జారీ చేసింది.

కోనసీమ జిల్లాకు రైల్వే లైన్ రావాలన్నది ఇక్కడి ప్రజల దశాబ్దాల కల. ఎన్నో ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా ఆచరణకు నోచుకోలేదు. వారి కల సాకారం కాలేదు
ఈ నేపథ్యంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరపడం, లేఖలు రాయడంతో ఆయన చేసిన కృషి ఫలించి తాజాగా నిధులు మంజూరయ్యాయి.

అసలు ఒప్పందం ప్రకారం ఈ రైల్వే లైన్ కు అవసరమైన భూ సేకరణతో పాటు సివిల్ నిర్మాణ వ్యయంలో 25 శాతం వాటాను భరించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. అందులో భాగంగానే ఈ రూ.100 కోట్లను విడుదల చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన నిధులను అమలాపురం ఆర్డీవో ఖాతాకు బదిలీ చేయనున్నారు. కోనసీమ జిల్లా కలెక్టర్, ఆర్డీవో పర్యవేక్షణలో భూసేకరణ పనులను వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైల్వే పనులు పూర్తి అయితే కోనసీమ జిల్లా తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి బాట పడుతుంది.

నిధుల విడుదలతో ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రధాన ఆర్థిక, భూసేకరణ అడ్డంకులు తొలగిపోయి నట్లయింది. దీంతో కోనసీమ ప్రాంత ప్రజలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్సాపురం – అమలాపురం ప్రజల కలను నెరవేర్చే దిశగా కృషి చేసిన ఎంపీ హరీష్ బాలయోగికి ఉభయ గోదావరి జిల్లా ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.