ఆరెకుల సంఘ భవనానికి రూ.1.50 కోట్ల నిధులు

ఉప్పల్‌ భగాయత్‌లో ఎకరం స్థలం కేటాయింపు.. ప్రభుత్వానికి సంఘం నేతల కృతజ్ఞతలు
రేగొండ, ఆంధ్రప్రభ
: ఆరెకుల సమాజ భవన నిర్మాణానికి ఉప్పల్‌ భగాయత్‌లో ఎకరం స్థలంతో పాటు రూ.1.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆరెకుల సంక్షేమ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

సమాజ అభివృద్ధికి, ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిట్టిపెల్లి శివాజీ, కన్వీనర్‌ జెండా రాజేష్‌, ప్రధాన కార్యదర్శి బలేరావు మనోహర్‌రావు, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు వలిగే నరసింగరావు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొల్లూరి కండేరావు, గౌరవ అధ్యక్షుడు కుండేకారి రవికుమార్‌, రాష్ట్ర సలహాదారు మారోజు నరసింహారావు, ఉపాధ్యక్షుడు నాగుల శంకర్‌రావు, సీనియర్‌ నాయకుడు నాగుర్ల రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.