కరుణగిరి వద్ద ట్రాఫిక్ నిబంధనలు..

కరుణగిరి వద్ద ట్రాఫిక్ నిబంధనలు..

కరుణగిరి పుణ్యక్షేత్ర యాత్రా మహోత్సవాలకు క్రైస్తవ భక్తులు
విరామం లేని విధులతో జ్యోతిర్మయి యానిమేటర్లు

ఆళ్లపల్లి, ఆంద్రప్రభ : రోమన్ కాథలిక్ మిషన్ ఖమ్మం పీఠం ఆర్సిఎం బిషప్ డిడి డాక్టర్ సగిలి ప్రకాష్ ఆదేశాల మేరకు, కరుణగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్లు రెవరెండ్ ఫాదర్స్ జ్వానేస్ ఖమ్మం జిల్లా జ్యోతిర్మయి డైరెక్టర్, ఫాదర్ కాకమాను రాజు సారధ్యంలో జరిగే కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవంలో విచారణలోని జ్యోతిర్మయి యానిమేటర్లు విరామం లేని విధులు నిర్వహించడం గర్వకారణమని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, ఆయా గ్రామాల వ్యాప్తంగా కరుణగిరి పుణ్యక్షేత్ర యాత్రా మహోత్సవాలకు క్రైస్తవ భక్తులు, విశ్వాసులు, జనసందోహంతో తరలిరావడంతో, బైపాస్ రోడ్డు కరుణగిరి వద్ద ట్రాఫిక్ నిబంధనలతో వాహనాలను, నిర్దేశించిన పలు మార్గాలకు తరలించడం, భక్తులను సక్రమంగా దివ్యబలి పూజాపీఠం ప్రాంతానికి వెళ్లేందుకు సరైనా మార్గాలకు పంపడం, పూజకార్యక్రమాలకు ఆటంకం లేని విధులను నిర్వహించడం గర్వకారణమని జ్యోతిర్మయి డైరెక్టర్ ఫాదర్ కాకమాను రాజు అభినందించారు.

ఫిబ్రవరి 27 నుండి మార్చి 02 వరకు ఖమ్మంలోని కరుణగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ప్రముఖ దైవ సందేశకులు, ఆధ్యాత్మిక గురువు, స్వస్థత వరాలు కలిగిన, అనుభవజ్ఞులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు డివైస్ వర్డ్ రిట్రీట్ సెంటర్ ఫాదర్ బెన్నీ ప్రసంగంతో పాటుగా విశ్రాంత బిషప్ పాల్ మైపన్ బిషప్ తండ్రి దివ్యబలి పూజను సమర్పిస్థారని తెలిపారు. 4 రోజులుగా ముగింపు పూజల్లో క్రైస్తవ భక్తులు, విశ్వాసులు, భక్తిశ్రద్ధలతో భారీఎత్తున ఉజ్జివ మహోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యోతిర్మయి కోఆర్డినేటర్ శౌరి, యానిమేటర్లు సుందర్రావు, ప్రసాద్, యేసురాజు, చిన్నప్ప, పాస్కాలి, శాంతయ్య, మోహన్రావు, బాబురావు, దేవానందం, బాలస్వామి,యోహాను,ఆంధ్రప్ప,ఆళ్లపల్లి విచారణ జ్యోతిర్మయి యానిమేటర్ పరమ ప్రభాకర్, బ్రదర్స్, సిస్టర్స్, గురువులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply