roja fired pawan kalyan : పవన్ కళ్యాణ్ గజనీ టైప్..

roja fired pawan kalyan : పవన్ కళ్యాణ్ గజనీ టైప్..

అంబటి కుటుంబానికి రోజా పరామర్శ

ఆపై వివాదాస్పద వ్యాఖ్యలు..

వెస్ట్ ఎమ్మెల్యే మాధవి భూమికి ఇంత ఉంటుందని బాడీ షేమింగ్..కొత్తగా ఎన్నికైన ఆమె కూడా వార్నింగ్ ఇస్తోందని మండిపాటు..

గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ:

roja fired pawan kalyan : : బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి ఆర్ కే రోజా తన మాటలతో గుంటూరులో వేడి పుట్టించి వెళ్ళారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి శుక్రవారం అంబటి ఇంటికి వెళ్లిన రోజా.. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు.

roja fired pawan kalyan : : రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని రోజా ప్రశ్నించారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులపై జరిగిన దాడి అత్యంత బాధాకరమని, ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇది చేతకాని దద్దమ్మలు చేసే పని అని ధ్వజమెత్తారు. “మేం తప్పు చేస్తే అడగండి.. కానీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం దాడులు చేస్తారా? ఈవీఎంలతో గెలిచి దుర్మార్గాలు చేస్తున్నారు” అని విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూ వివాదంపై స్పందిస్తూ.. “వెంకటేశ్వర స్వామి చంద్రబాబు కలలోకి వచ్చి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పారా? చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు” అని నిలదీశారు.

roja fired pawan kalyan : : పవన్ కళ్యాణ్ ఒక ‘గజనీ’ అని, రోజుకో వేషం వేసుకుంటాడని ఎద్దేవా చేశారు. పవన్ గతంలో బాప్టిజం తీసుకున్నానని చెప్పారని, గొడ్డు మాంసం తింటారని.. అలాంటి పవన్, చంద్రబాబులకు బుద్ధి జ్ఞానం లేదని, వీళ్లే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్లు అప్పు చేశారని, మెడికల్ కాలేజీలు అమ్మేసుకుంటున్నారని ఆరోపించారు. “మా ఇంట్లో పిల్లల ఫొటోలు మార్ఫింగ్ చేస్తారు.. ఇప్పుడు లడ్డూలో హార్పిక్ కలిసిందంటారు.. ఇలాంటి ఆలోచనలు చంద్రబాబుకు తప్ప ఎవరికీ రావు. అసలు శాంపిల్స్ ఎవరి హయాంలో తీసుకున్నారో గుర్తుపెట్టుకో” అని హెచ్చరించారు. ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కేసులు వేయాలని, చంద్రబాబు పూజల సమయంలో కూడా బూట్లు వేసుకుంటారని, ఆయనకు దేవుడంటే గౌరవం లేదని విమర్శించారు.

roja fired pawan kalyan : : గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళ మాధవిపై రోజా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేస్తూ.. “ఆమె భూమికి ఇంత ఉంటుంది.. కొత్తగా ఎమ్మెల్యే అయ్యింది.. ఆమె వార్నింగులు ఇస్తూ మాట్లాడుతోంది. మీరు రౌడీయిజం చెయ్యాలంటే అధికారం కావాలేమో కానీ, మాకు జగన్ ఒక్క సైగ చేస్తే చాలు” అని హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసులు జీరోకు పడిపోయారని, ఫోన్ చేసినా సమాధానం చెప్పడం లేదని, పోలీసులు దగ్గరున్నప్పుడే దాడులు జరిగితే ఇక వారెందుకు, వారు కూడా పచ్చ చొక్కాలు వేసుకోవచ్చు కదా అని ఎద్దేవా చేశారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేశారని, రేపు జగన్ అధికారంలోకి రావడం నిజమని, అప్పుడు మిమ్మల్ని వీళ్లు కాపాడలేరని హెచ్చరించారు. అంబటి ఇంటిపై దాడి ఘటనలో హత్యాయత్నం కేసు పెట్టలేదని, కూటమి పాలనలో రక్షణ లేనందున రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. జనసేనలో చిల్లర వెధవలు, పనికిమాలిన వారే ఉన్నారని, పవన్ ప్యాకేజీల కోసం రాజకీయాలకు వస్తే ఆయనను నమ్ముకున్న వారు అన్యాయమైపోతారని వ్యాఖ్యానించారు.

roja fired pawan kalyan : : అనంతరం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, అంబటిపై జరిగిన దాడిని కిరాతకులు చేసే దాడిలా అభివర్ణించారు. అంబటిని అవమానించాలనే పని గట్టుకొని మహిళలతో బూతులు మాట్లాడించారని మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై అంబటి ఆవేశంలో మాట్లాడానని వివరణ ఇచ్చి, మాటలు వెనక్కు తీసుకున్న తర్వాత కూడా కుట్రకు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి వారిని బెదిరించడంలో భాగంగానే అంబటి ఇంటిపై దాడి చేశారని, సీబీఐ నివేదికతో ఆత్మరక్షణలో పడ్డ ప్రభుత్వం నిందను జగన్ పై వేసేందుకే ఫ్లెక్సీలు వేయించిందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ అయోధ్య రామాలయానికి కూడా జంతువుల కొవ్వు కలిసిన లడ్డు పంపారని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని, జగన్ ను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది కేవలం అంబటిపై దాడి కాదు, హైందవ సమాజంపై దాడి అని, ఇంట్లో మహిళలు, పిల్లలు ఉన్నారని చూడకుండా దాడికి పాల్పడటం దుర్మార్గమని భూమన అన్నారు.

Leave a Reply