rohingya-refugees-death-boats క‌డ‌లిలో క‌న్నీటి జ‌ల‌ధి Andhra Prabha Top Story

rohingya-refugees-death-boats క‌డ‌లిలో క‌న్నీటి జ‌ల‌ధి Andhra Prabha Top Story

  • రోహింగ్యాల క‌ష్టాల హోరు
  • బువ్వ కోసం వెతుకులాట
  • మృత్యుప‌డ‌వ‌ల్లో ప‌య‌నం
  • శిబిరాల నుంచి కిడ్నాప్‌లు..
  • మూడు దేశాల్లో అమ్మ‌కం
  • నిత్యం వందలాది మంది సాగ‌రం పాలు

(ఆంధ్ర‌ప్ర‌భ‌, కాక్స్‌బజార్ (బంగ్లాదేశ్)

‘‘ఓ బా..’’ అంటూ ఆ బాలుడు తండ్రిని పిలిచాడు. గొంతులో భయం.. మాటల్లో వణుకు.. కళ్ల ముందు కనిపించని ప్రమాదం. ‘‘నన్ను మలేసియాకు పంపేందుకు పడవలో ఎక్కిస్తున్నారు’’ అన్నాడు. అదే అతని తండ్రి అబ్దుల్ నూర్ చివరిసారిగా విన్న తన కుమారుడి మాట. ఆ ఫోన్‌కాల్ తర్వాత ఆ బాలుడి నుంచి ఎలాంటి సమాచారం లేదు.

ఆ రోజు ఆ బుడ్డోడు..

అతని పేరు జానీ ఆలం. వయసు కేవలం 15 ఏళ్లు. బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్ శరణార్థి శిబిరంలో కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. దాదాపు పదేళ్లుగా అదే శిబిరం త‌మ‌ నివాసం. పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా రెండు నెలల క్రితం ఒక సాయంత్రం అతడిని కొందరు దుండగులు అపహరించారు. ఆ తర్వాత అతడిని మలేసియాకు వెళ్లే పడవలోకి బలవంతంగా ఎక్కించారు. కొడుకును విడిపించుకోవడానికి తండ్రి నూర్ శిబిరంలోని బంధువులు, ఇరుగుపొరుగు వారి వద్ద నుంచి డబ్బులు సేకరించాడు. అపహరణకారులు కోరిన సుమారు 2,800 డాలర్లను సమకూర్చేందుకు ప్రయత్నించాడు. కానీ చివరకు కొడుకు ఆచూకీ లేకుండా పోయింది.

ఆఖ‌రి మాటలే మిగిలాయి..

‘‘నీ కొడుకును ఇక్కడ అమ్మేశారు. అతడిని మలేసియాకు పంపిస్తాం’’ అని ఫోన్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి చెప్పినట్లు నూర్ చెబుతున్నాడు.ఆ తర్వాత ఆలం ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. జూలైలో మయన్మార్ తీరంలో అదృశ్యమైన రెండు పడవల్లో ఉన్న 500 మందికి పైగా ప్రయాణికుల్లో తన కుమారుడు కూడా ఉండి ఉంటాడని నూర్ అనుమానిస్తున్నాడు. ఇప్పుడు అతని ఇంట్లో కొడుకు లేడు. కానీ కొడుకు జ్ఞాపకాలు మాత్రం అడుగడుగునా కనిపిస్తున్నాయి. ‘మా గుడారంలోని ప్రతి మూలా వాడిని గుర్తు చేస్తోంది’’ అని 55 ఏళ్ల నూర్ కన్నీళ్లతో చెబుతున్నాడు. తన కుమారుడు చదువుకునే చిన్న బల్లను చూపిస్తూ.. అక్కడే అతడి జ్ఞాపకాలను వెతుక్కుంటున్నాడు. ఫుట్‌బాల్ ఆడటం అంటే ఆ బాలుడికి ఎంతో ఇష్టం. స్నేహితులతో కలిసి ఆడుకునే ఆ ప్రశాంతమైన పిల్లాడు.. ఇప్పుడు ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేదో కూడా తండ్రికి తెలియదు.

ప్రమాదమని తెలుసు

రోహింగ్యాలు మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి చెందిన రాజ్యం లేని ముస్లిం మైనారిటీ ప్రజలు. దశాబ్దాలుగా హింస, అణచివేతను ఎదుర్కొంటున్నారు. మయన్మార్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం పరిస్థితులను మరింత దారుణంగా మార్చింది.బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్ శిబిరాల్లోనూ పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నేరాలు, హింస, ఉపాధి అవకాశాల కొరత, ఆహారం-నీటి సమస్యలు.. భవిష్యత్తుపై ఆశలు లేకుండా చేస్తున్నాయి. దీంతో ప్రతి ఏటా వేలాది మంది రోహింగ్యాలు పాత చేపల పడవలను ఆశ్రయిస్తున్నారు. వాటి ఇరుకైన గదుల్లో కిక్కిరిసి కూర్చొని బంగాళాఖాతం, అండమాన్ సముద్రాన్ని దాటే ప్రమాదకర ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. గమ్యం.. మలేసియా ఇండోనేసియా. అక్కడైనా బతుకు బాగుపడుతుందన్న ఆశ. కానీ ఆ ఆశల ప్రయాణంలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఏడుగురిలో ఒకరు.. గ‌ల్లంతే

ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ఈ సముద్ర మార్గంలో ప్రయాణించే ప్రతి ఏడుగురిలో ఒకరు గమ్యానికి చేరకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలో దాదాపు 6,500 మంది రోహింగ్యాలు సముద్ర ప్రయాణం చేయగా.. వారిలో దాదాపు 900 మంది గల్లంతయ్యారు లేదా మరణించారు.ఇది ప్రపంచంలోనే శరణార్థులు, వలసదారులు సముద్ర మార్గంలో ప్రయాణించే అత్యంత ప్రాణాంతక మార్గంగా ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ పేర్కొంటోంది.

పరిస్థితి మరింత విషమం

జూన్ చివరి నాటికి దాదాపు 5,700 మంది ఈ సముద్ర ప్రయాణానికి ప్రయత్నించారు. తొలి ఆరు నెలల్లోనే 820 మంది చనిపోయినట్లు లేదా గల్లంతైనట్లు నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు, నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే.. ఎంతోమంది పడవలు ఎవరికీ తెలియకుండా సముద్రంలో మునిగిపోతున్నాయి. వాటిలో ప్రయాణించిన వారి జాడ కూడా మిగలడం లేదు.

బతుకు కోసం బయలుదేరి..

అందరూ స్వచ్ఛందంగా ఈ పడవల్లో ఎక్కడం లేదు. కాక్స్‌బజార్ శిబిరాల్లో అపహరణలు పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ముఠాలు యువకులు, చిన్నారులను కూడా ఎత్తుకెళ్తున్నాయి. ఆ తర్వాత వారిని అక్రమ రవాణా ముఠాలకు అప్పగిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. అపహరణకు గురైన ప్రతి ఒక్కరినీ పడవలోకి పంపించకపోయినా.. సముద్ర అక్రమ రవాణా పెరుగుతుండటంతో ప్రయాణికుల కోసం డిమాండ్ పెరిగిందని రోహింగ్యాల హక్కుల కోసం పనిచేస్తున్న నిపుణులు చెబుతున్నారు. పడవల్లోకి వెళ్లిన తర్వాత పరిస్థితులు మరింత దారుణం. అత్యంత ఇరుకైన ప్రదేశాల్లో వందలాది మందిని కుక్కేస్తున్నారు. ఆహారం, నీరు సరిగా ఉండవు. అనారోగ్యాలు, వేధింపులు, దోపిడీ సాధారణమైపోయాయి.

మృత్యువైపు రెండు పడవలు

ఇటీవల అదృశ్యమైన రెండు పడవలు జూన్ 29న మయన్మార్ నుంచి బయలుదేరినట్లు సమాచారం. ఒక పడవలో సుమారు 250 మంది ఉన్నారు. బయలుదేరిన కొద్దిసేపటికే దానితో సంబంధాలు తెగిపోయాయి. మరో పడవలో దాదాపు 280 మంది ఉన్నారు. అది వారం రోజుల తర్వాత మయన్మార్ తీరానికి సమీపంలోని అండమాన్ సముద్రంలో మునిగిపోయినట్లు భావిస్తున్నారు. సాధారణంగా ఈ సముద్ర ప్రయాణాలు నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్య జరుగుతాయి. కానీ ఈ రెండు పడవలు వర్షాకాలంలో బయలుదేరాయి.

ఇది ప్రమాదకర‌ కాలం.

భారీ అలలు.. ఆకస్మిక తుపాన్లు.. అనిశ్చిత వాతావరణం..ఇవన్నీ తెలిసినా అక్రమ రవాణా ముఠాల ఒత్తిడితో పడవలను సముద్రంలోకి పంపినట్లు సమాచారం. ఒక పడవ బయలుదేరిన 12 గంటల్లోనే బోల్తా పడినట్లు రోహింగ్యా హక్కుల కార్యకర్త క్రిస్ లెవా తెలిపారు. దాదాపు పది మంది ప్రయాణికుల మృతదేహాలు మయన్మార్ ఉత్తర రఖైన్ తీరంలో కనిపించినట్లు సమాచారం. బంగ్లాదేశ్ పోలీసులు కూడా జూలై తొలి రెండు వారాల్లో ఆ దేశ దక్షిణ తీరంలో ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అవి వలస పడవల ప్రయాణికులవై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రెండో పడవ మాత్రం సుమారు తొమ్మిది రోజుల పాటు ప్రయాణించింది. జూలై 8న అండమాన్ సముద్రంలో బోల్తా పడినట్లు