కొన్ని గంటల్లో అంతిమ యాత్ర

- రోబో శంకర్ అభిమాన జనం కంటతడి
- సినీ ఇండస్ర్టీ కన్నీటి తర్పణం
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్): ఇక ఆ.. రోబో శంకర్ స్సెప్పుల్ని .. స్మార్ట్ ఫోన్ లో బిట్లు బిట్లుగా ఎంజాయ్ చేయాల్సిందే. ఎందుకంటే… ఆయన డాన్స్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ దగ్గరకు వెళ్లిపోయాడు. ఇక అక్కడే ప్రాక్టీస్.. అని సోషల్ మీడియా(Social media) భావురుమంటోంది. కడసారి చూసేందుకు అభిమాన జనం చెన్నైలోని వలసరవక్కంలోని ఆయన ఇంటికి క్యూ కట్టారు. సినీ ప్రముఖులు కన్నీటి సంతాపం వ్యక్తం చేశారు. ఔను, తమిళ హాస్యనటుడు రోబో శంకర్ ఇక లేరు. (Comedian Robo Sankar) చెన్నైలోని గాడ్స్(Gods) జిల్లా సినిమా సెట్‌లో గురువారం కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చారు. ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా రోబో శంకర్ సినీ ఇండస్టీకి దక్కలేదు. (He dead) శుక్రవారం ఆయనకు కన్నీటితో తుది వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. “ రోబో శంకర్ అనేది ఒక పేరు మాత్రమే, నా కోసం నా తమ్ముడివి. నన్ను వదిలి ఎలా వెళ్ళిపోతావు? నీ పని పూర్తయింది, నువ్వు వెళ్ళిపోయావు. కానీ నా పని ఇంకా మిగిలే ఉంది” అంటూ కమల్ హసన్ (Kamal Hassan Tributes) నివాళి అర్పించారు.
ఈ .. రోబో శంకర్ ఎవరు?
మిమిక్రీ ఆర్టిస్టుగా.. బుల్లి తెర మీద ప్రత్యక్షమైన శంకర్.. వెండి తెరపై రోబో శంకర్ గా అవతరించారు. గత పదేళ్ల కాలంలో.. అతి వేగంగా అగ్రస్థానానికి చేరటానికి అనేక మైలు రాళ్లు దాటాడు. నిజానికి 1997లో ధర్మచక్రం, 1999లో వడయప్ప (కోలివుడ్ సూపర్ స్టార్ రజనీ నటించిన నరసింహ) అనే చిత్రాల్లో నటించాడు. కానీ జనం మదిలో చోటు దొరకలేదు. శంకర్ అనే వ్యక్తి ఎవరో ఎవరికీ తెలియలేదు. ఇక 2007 దీపావళి సినిమాలతో శంకర్ సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆయన కామెడీ టైమింగ్, యాక్షన్ ప్రేక్షకుల మదిని కొల్లగొట్టింది. ధనుష్ నటించిన మారి సినిమాతో శంకర్ అంటే ఏంటో జనానికి తెలిసింది. ఇక అజిత్ “విశ్వాసం”, శివకార్తికేయన్ “వేలైక్కారన్” సూపర్ హిట్ మూవీల్లో శంకర్ తన సత్తా చాటాడు.
హస్యంతో.. కన్నీళ్లు పంచాడు

1978 డిసెంబర్ 24న పుట్టిన శంకర్ – 46 ఏళ్ల ప్రాయంలో కన్నుమూశారు. తమిళ చిత్రాలలో భారతీయ స్టాండప్ కమెడియన్ నటుడిగా పేరొందారు. తమిళ స్టార్ విజయ్ చిత్రం కలక్క పోవతు యారుతో స్టాండప్ కామెడీ ప్రదర్శించి తన పురోగతిని సాధించాడు, అతను స్టార్ విజయ్‌లోని అనేక టీవీ షోల్లో నటించాడు ఆ ఛానెల్ కోసం టెలివిజన్ షోలను అందించాడు. రోబో శంకర్ మొదట బుల్లితెరపై(On television) ప్రసిద్ధి చెందాడు, ఆ తరువాత స్మార్ట్ టీవీల్లో చెలరేగిపోయాడు. అతని కామెడీ స్కెచ్‌లు అతనికి ఇంటి పేరును తెచ్చిపెట్టాయి. తరువాత అతను సినిమాల్లోనూ ప్రముఖ తమిళ తారలతో కలిసి నటించాడు. ఇదర్‌కుతానే ఆసైపట్టై బాలకుమార, వాయై మూడి పెసవుమ్, మారి, వేలైను వంధుట్ట వెల్లైకారన్ చిత్రాలలో తన విశ్వరూపం బయటపడింది. విశ్వాసం, పులి, ఎస్ 3 , కోబ్రా భారీ చిత్రాల్లోనూ శంకర్ తానేంటో చూపించాడు. గత పదేళ్లుగా.. టీవీ, స్విల్వర్ స్ర్కీన్ .. ఈ రెండు మాధ్యమాలను సమతుల్యం చేశాడు, తరచుగా టెలివిజన్, సినిమాల మధ్య కదులుతున్నాడు. ఆ క్రాస్ ఓవర్ అతనికి తమిళ వినోదంలో స్థిర ఉనికిని చాటింది. ఆయన మరణం వార్తతో అభిమానులు అతని క్లిప్‌లను, జ్ఞాపకాలను ఆన్‌లైన్‌లో షేర్ ప్రారంభించారు. అతడు అత్యుత్తమ హాస్య నటుడని, రోబో శంకర్ స్కిట్‌లు చూస్తూ పెరిగామని, ఆయన హాస్యాన్ని మిస్ అవుతున్నామని కామెంట్లు పెట్టారు.
స్మాల్ టీవీసే.. బిగ్ స్మార్ట్ స్ర్కీన్ ..
రోబో శంకర్ స్పీడ్ గమనం
శంకర్ గ్రామీణ ప్రదర్శనలలో రోబో నృత్యాలు చేసిన తర్వాత రోబో శంకర్ అనే పేరు సంపాదించాడు. అతను మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రారంభంలో కలక్క పోవతు యారు? అతు ఇతు ఎతు యొక్క ‘సిరిచ పోచు’ విభాగంలో ప్రదర్శన ఇచ్చాడు. గోకుల్ అతనికి రౌతిరామ్ (2011)లో ఒక పాత్రను అందించాడు. అతని అనేక సన్నివేశాలను చిత్రం నుండి తొలగించారు, పాటలో కనిపించడం మినహా. గోకుల్ మళ్ళీ ఇధర్కుతానే ఆసైపట్టై బాలకుమార (2013)లో అతనికి ఒక పాత్రను ఇచ్చాడు, ఇది శంకర్ కు నటుడిగా బ్రేక్ ఇచ్చింది. యారుడ మహేష్ కప్పల్ చిత్రాలలో చిన్న పాత్రలు చేసిన తర్వాత, బాలాజీ మోహన్ వాయై మూడి పెసవుమ్ (2014)లో శంకర్‌ను ఎంపిక చేసుకున్నాడు. అతను టూరింగ్ టాకీస్ (2015)లో ప్రతికూల పాత్రను పోషించాడు. ఆ తర్వాత అతను మారి (2015) లో నటించాడు, అక్కడ అతని నటనను విమర్శకులు “ప్రత్యేక ప్రశంసకు అర్హుడు” అని “తన ప్రత్యేక వన్-లైనర్లు , బాడీ లాంగ్వేజ్‌తో షోను దొంగిలించారు” అని పేర్కొన్నారు. వేలైను వందూత్త వెల్లైకారన్ (2016) లో కోమాలోకి వెళ్ళిన ఎమ్మెల్యేగా అతని నటనకు మంచి స్పందన లభించింది, విమర్శకులు అతని నటనను “ఒక కేక” “ఆ సంవత్సరంలో అత్యంత హాస్యభరిత, నవ్వించే – నటనగా మార్కులు వేశారు. అవును, బీపీని తగ్గించే – కామెడీ స్ట్రెచ్” అని అభివర్ణించారు
సతీ..తనయ నటులే
శంకర్ కుమార్తె ఇంద్రజ శంకర్ బిగిల్ చిత్రంలో మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణిలలో ఒకరిగా జీ తమిళ్‌లో ప్రసారమైన సర్వైవర్ షోలో నటించింది. ఆయన భార్య ప్రియాంక శంకర్ కన్ని మాడం (2020) చిత్రంతో తన నటనను ప్రారంభించారు, దీనికి ఆయన నేపథ్య గాయనిగా పనిచేశారు. 2023లో, బరువు తగ్గించే ప్రయాణంలో ఉన్నప్పుడు కామెర్లు కారణంగా ఆయన అదనపు బరువు తగ్గడంతో పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.
