మల్లంపల్లి అభివృద్ధికి రూ.21 కోట్లతో రహదారి పనులు
- టెండర్ ప్రక్రియ పూర్తి.. త్వరలోనే పనులు ప్రారంభం
- రూ.65 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్ ప్రారంభం
మల్లంపల్లి, ఆంధ్రప్రభ : మల్లంపల్లి గ్రామ అభివృద్ధికి రూ.21 కోట్లతో చేపట్టనున్న రహదారి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు. “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా మల్లంపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రూ.65 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్‌ను ప్రారంభించారు. వన మహోత్సవంలో భాగంగా గీతా వృత్తిదారులతో కలిసి ఈత మొక్కలు నాటారు. గ్రామ ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
మల్లంపల్లి గ్రామానికి అత్యంత కీలకమైన కట్కూరు ఎక్స్ రోడ్డు–గొల్లపల్లి–మల్లంపల్లి–మోత్కులపల్లి రహదారి అభివృద్ధికి రూ.21 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలోనే రహదారి పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష
గ్రామంలో పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా, కళ్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, అంగన్‌వాడీ భవనం, పాఠశాల కాంపౌండ్ వాల్ వంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
ప్రజలు జలసిరి కార్యక్రమం కింద ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. రైతులు ఆరుతడి పంటల సాగుతో పాటు ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్టీల్ బ్యాంక్‌ను వినియోగించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందించడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
