Road | వంతెన నిర్మాణంలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం…

Road | వంతెన నిర్మాణంలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం…

Road | రామన్నపేట, ఆంధ్రప్రభ : మండలంలోని సిరిపురం గ్రామంలో ఈ రోజు రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. సిరిపురం నుంచి పెద్ద కాపర్తి వెళ్లే మార్గంలో కొనసాగుతున్న ధర్మారెడ్డి పల్లి కాల్వ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న వంతెన ప్రమాణాలకు తగిన విధంగా లేదని రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాల్వపై నిర్మిస్తున్న వంతెనకు అవసరమైన ఎత్తు లేకపోవడంతో పాటు రోడ్డు(road)కు సంబంధించిన క్రాసింగ్‌ను సరిగా డిజైన్(design) చేయలేదని రైతులు ఆరోపించారు.

గ్రామ రైతులను సంప్రదించకుండా కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కాల్వ వద్ద ధర్నాకు దిగారు. ఇలాగే పనులు కొనసాగితే వ్యవసాయ భూముల(agricultural land)కు వెళ్లే రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని వంతెన ఎత్తును పెంచడంతో పాటు క్రాసింగ్ వద్ద లెవెల్ సెట్ చేసి నిర్మాణాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు.

సమస్యలను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో ఉప సర్పంచ్ మూడు దుడ్ల అనుష రమేష్‌తో పాటు కూనూరి ముత్తయ్య, బండ శ్రీనివాస్ రెడ్డి, ఏళ్ల సంజీవరెడ్డి, గుంటూజి కృష్ణమాచారి, బల్గూరి అంజయ్య, ఏళ్ల వెంకట నరసయ్య, కట్ట శేఖర్ రెడ్డి, బెడద రమేష్, నర్రా నర్సిరెడ్డి, ఏళ్ల మల్లారెడ్డి, గజం సత్యనారాయణ, మోటి మల్లేశం వడ్లపల్లి శ్రీనివాస్, పొట్ట బత్తుల వెంకటేష్, అప్పం వెంకటేష్, దూలం రవి, పబ్బు మల్లయ్య, దయ్యాల శ్రీశైలం, మోటి రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply