Road Construction | అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా..

Road Construction | అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా..

  • అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
  • సర్పంచ్ అభ్యర్థి పుల్లూరి ప్రశాంతి వేణుగోపాల్ రావు

Road Construction | పెద్దపల్లి జిల్లా జూలపల్లి, ఆంధ్రప్రభ : వడుకాపూర్ గ్రామాన్ని మండలంలోనే అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేలా ముందుకు తీసుకెళ్తానని సర్పంచ్ అభ్యర్థి పుల్లూరి ప్రశాంతి వేణుగోపాలరావు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే విజయ రమణారావు(MLA Vijaya Ramana Rao) సహకారంతో గ్రామానికి పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చామని, నిధులతో గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేసినట్లు స్పష్టం చేశారు.

మహిళల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని, ఒకసారి సర్పంచ్ గా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గ్రామంలో బ్యాట్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని వాడవాడలా ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. గ్రామంలో ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని, గ్రామస్తుల సలహాలు, సహకారంతో ముందుకు సాగుతామని తెలిపారు.

గ్రామ అభివృద్ధి కోసం రహదారుల నిర్మాణం(Road Construction), శుద్ధి చేసిన తాగునీటి సరఫరా, ఇతర మౌలిక వసతులతోపాటు పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందించి ప్రయోజనాలు అందేలా చూస్తానన్నారు. వడ్కాపూర్ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.

Leave a Reply